ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సమీప భవిష్యత్తులో ఇలాంటి ఒక కాలం రాబోతున్నది. అందులో – కొంత మంది ప్రజలు కూర్చుని ఉంటారు, ఒకడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఉంటాడు. అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసు తెలియజేయబడుతుంది. దానికి అతడు ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్య తీర్పు చెప్పేది ఏదైనా ఉంది అంటే అది ‘అల్ ఖుర్’ఆన్ అల్ కరీం’. అది చాలు మాకు. అందులో మాకు ఆచరించవలసిన విషయాలుగా (హలాల్ విషయాలుగా) కనిపించిన అంతటిపై మేము ఆచరిస్తాము, మరియు అందులో నిషేధించబడిన విషయాలుగా (హరాం విషయాలుగా) కనిపించిన దానినుండి దూరంగా ఉంటాము. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – తన సున్నత్’లో తాను నిషేధించిన ఏ విషయమైనా లేదా తాను నిరోధించిన ఏ విషయమైనా, అది అల్లాహ్ తన గ్రంథములో నిషేధిస్తూ ఆదేశించిన దానితో సమానం. ఎందుకంటే ప్రతిదీ తాను తన ప్రభువు నుండే అంద జేస్తున్నాడు గనుక.