అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.” ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశద పరుస్తున్నారు: ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తాను పలుకని మాటలను తన మాటలుగా, తాను ఆచరించని ఆచరణను తన ఆచరణగా తనకు ఆపాదించినట్లయితే – అతడు తనను గురించి అసత్యం పలుకుతున్నాడు. తీర్పు దినమున అటువంటి స్థానము నరకాగ్నిలో ఉంటుంది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అసత్యం పలికినందుకు గాను అతనికివ్వబడే ప్రతిఫలం.

explain-icon

fawaed

  • నరకాగ్నిలోనికి వేయబడడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను గురించి ఉద్దేశ్యపూర్వకంగా అసత్యాలు పలకడం అనేది కూడా ఒక కారణం.
  • ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గురించి అసత్యాలు పలకడం అనేది మిగతా ఎవరి గురించి అయినా అసత్యం పలకడంతో సమానం కాదు. ఎందుకంటే ఆయనను గురించి అసత్యం పలకడం ధర్మములో (ఇస్లాం లో) మరియు ప్రపంచములో గొప్ప ఉపద్రవాన్ని సృష్టిస్తుంది.
  • ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథులను, వాటి ప్రామాణికతను ధృవీకరించుకొనక ముందే వాటిని ప్రచురించరాదు మరియు వ్యాపింప జేయరాదు అనే హెచ్చరిక ఉన్నది.
explain-icon

ఇంకా