ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్ యొక్క) దాసులలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేక ఆమె తనను తాను పరిశుద్ధపరుచుకుని (వుదూ అవసరమైతే వుదూ, లేక ఘుసుల్ అవసరమైతే గుసుల్ ఆచరించి), నిలబడి తను పాల్బడిన పాపానికి పశ్చాత్తాప పడే సంకల్పముతో, రెండు రకాతుల నమాజు ఆచరించి, అల్లాహ్ ను క్షమాభిక్ష కోరితే అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క వాక్కులను పఠించినారు: {والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون} {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుధ్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలె ఇమ్రాన్: 3:135]