తన సంరక్షకుల అనుమతి లేకుండా స్త్రీ తనకు తానుగా వివాహం చేసుకునే స్త్రీకి వ్యతిరేకంగా, “ఆమె వివాహం చెల్లదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హెచ్చరించారు. “చెల్లదు” అని ఆయన మూడుసార్లు పునరావృతం చేసారు; అసలు ఎన్నడూ అలా జరుగకూడదు అన్నట్లుగా. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి, ఆమె సంరక్షకుల సమ్మతి, అంగీకారం లేకపోయినా ఆమెతో సంబోగములో పాల్గొన్నట్లయితే ఆమె యోనితో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు నిర్ణయించబడిన వరకట్నం పూర్తిగా ఆమెదే అవుతుంది (ఆమె సంరక్షకులకు అందునుండి ఏమీ చెందదు). వివాహ ఒప్పందం యొక్క సంరక్షకత్వంపై సంరక్షకుల మధ్య వివాదం ఏర్పడితే - మరియు ఈ విషయంలో వారందరూ సమాన స్థాయిలో ఉంటే – ఒప్పందం కొరకు వారిలో ఎవరు మొదట ముందడుగు వేసినారో వారికే వెళుతుంది, అయితే అది అన్ని కోణాలలో ఆమె శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది. సంరక్షకుడు ఆమెను అతనికిచ్చి వివాహం చేయడానికి నిరాకరిస్తే, ఆమెకు సంరక్షకుడు ఎవరూ లేనట్లే; ఈ సందర్భంలో, పాలకుడు లేదా అతని ప్రతినిధి, అంటే న్యాయమూర్తి మరియు అలాంటి వారు ఆమెకు సంరక్షకుడిగా మారతారు. చట్టబద్ధమైన సంరక్షకుడు ఉంటే పాలకుడికి సంరక్షకత్వం ఉండదు.