ఈ హదీసులో అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా : ‘స్వచ్ఛందంగా ఆచరించే నమాజులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి తాను పది రకాతుల నమాజులను గుర్తుంచుకున్నానని, వాటిని సునన్ అర్’రవాతిబ్ అంటారని’ వివరిస్తున్నారు. అవి: జుహ్ర్ సలాహ్ (నమాజు)కు ముందు రెండు రకాతులు, జుహ్ర్ నమాజు తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత తన ఇంటిలో రెండు రకాతులు, ఇషా నమాజు తరువాత తన ఇంటిలో రెండు రకాతులు, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు. ఆవిధంగా అవి మొత్తం పది రకాతులు. అలాగే జుమా దినము నాడు (శుక్రవారము నాడు) జుమా నమాజు తరువాత రెండు రకాతులు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించేవారు.