భవిష్యత్తులో జరుగబోయే విషయాలు చెప్పే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది. దానికి వారు: వారిని గురించి ఎక్కువ ఆలోచించకండి, వారి మాటలను తీసుకోకండి (నమ్మకండి), మరియు వారు చేసే పనులపట్ల ఆసక్తి చూపకండి” అన్నారు. దానికి వారు (ప్రజలు) ఇలా అన్నారు: “కొన్ని సందర్భాలలో వారు చెప్పేది వాస్తవానికి అనుగుణంగానే ఉంటుంది. ఉదాహరణకు భవిష్యత్తులో జరుగబోయే ఏదైనా (మనకు తెలియని, అగోచర) విషయాన్ని గురించి ‘ఫలానా నెలలో, ఫలానా దినమున ఇలా జరుగుతుంది’ అని చెప్పినట్లయితే – వారు చెప్పినట్లుగానే జరుగుతుంది.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “జిన్నాతులు ఆకాశాలలో దొంగతనంగా విన్న విషయాన్ని తీసుకుని వారు జ్యోతిష్యులలో తమ మిత్రులైన జ్యోతిష్యుల దగ్గర దిగి తాము విన్నదానిని వారికి తెలుపుతారు. జ్యోతిష్యులు తాము విన్న ఆకాశపు విషయానికి వంద అబద్దాలు జతచేస్తారు.”