మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "నీతిమంతులైన నా బానిసల కోసం నేను స్వర్గంలో ఎటువంటి గొప్ప గౌరవాన్ని, సన్మానాన్ని సిద్ధం చేశానంటే, దాని స్వరూపాన్ని ఎవరి కళ్ళూ చూడలేదు, ఎవరి చెవులూ వినలేదు, ఎవరి హృదయాలూ ఊహించలేదు." అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "మీరు కోరితే ఈ ఆయత్ని పఠించండి": {فَلَا تَعْلَمُ نَفْسٌ مَّآ أُخْفِىَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍۢ} "ఏ ప్రాణికీ తన కోసం దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు." [అస్సజదహ్:17]