ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది – ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలను ప్రస్తావించారు: మొదటిది: పేదలకు తరచుగా అన్నం పెట్టడం, ఇందులో స్వచ్ఛంద సేవ, బహుమతులు, ఆతిథ్యం ఇవ్వడం మరియు విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఉన్నాయి. ఇతరులకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కరువు, ధరల పెరుగుదల కాలంలో మరింత స్పష్టమవుతుంది. రెండవది: ప్రతి ముస్లిం కి ‘సలాం’ చేయడం, వారు నీకు పరిచయం ఉన్నవారైనా, పరిచయం లేని వారైనా సరే.