ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో ‘సలాం’ ను విస్తరించే విధానానికి సంబంధించిన విధానాలను బోధిస్తున్నారు – అది “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు మీపై కురియుగాక). చిన్న వాళ్ళు (వయసులో) పెద్దవారికి సలాం చేయాలి; సవారీ అయి ఉన్న వ్యక్తి, కాలినడకన వెళుతున్న వానికి సలాం చేయాలి; కాలినడకన వెళుతున్న వ్యక్తి కూర్చుని ఉన్న వ్యక్తికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.