ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తమ తోటి ముస్లిం సోదరులను కలుసుకున్నప్పుడల్లా ఒకరికొకరు అభివాదం చేయాలని (సలాం చేయాలని) ప్రోత్సహించడం చూడవచ్చు. వారు కలిసి నడుస్తున్నప్పుడు, వారి మధ్య చెట్టు, గోడ లేదా పెద్ద రాయి వంటి అడ్డంకి వచ్చి దానికి అటువైపు నుండి ఒకరు, ఇటువైపు నుండి ఒకరు నడుస్తూ, తరువాత వారు మళ్ళీ కలుసుకున్నప్పుడు, వారు మళ్ళీ ఒకరికొకరు సలాం చేయాలి – సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అవుతున్నప్పటికీ.