ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు: ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న దగ్గరికి వెళితే అతడు ‘సలాం’ చెప్పాలి, అలాగే అతడు సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళడానికి లేచినపుడు కూడా అక్కడి వారికి ‘సలాం’ చేయాలి; వెళ్ళేటప్పుడు చేసే రెండవ ‘సలాం’ కంటే వచ్చినప్పుడు చేసిన మొదటి ‘సలాం’ మరింత అర్హమైనది కాదు.