ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక)" అని అన్నాడు: దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతడు కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "అతడి కోసం పది పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. తరువాత మరొకరు వచ్చి "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ శాంతి, దయ కలుగుగాక)" అని అన్నాడు: దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతను కూర్చుకున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "అతడి కోసం ఇరవై పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. ఆ తరువాత మరొకరు వచ్చి "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు" (మీపై అల్లాహ్ శాంతి, కరుణ మరియు దీవెనలు కలుగుగాక) అని అన్నాడు. దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతడు కూడా కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "అతడి కోసం ముప్ఫై పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. అంటే, సలాము అభివాదంలోని ప్రతి పదానికి పది పుణ్యాలు లెక్కించబడతాయి అన్నమాట.