ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ అయి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అని అర్థించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం అతడిని క్షమించమని అన్నారు, ఎందుకంటే ఆయన వద్ద అతడికి సవారీగా ఇవ్వడానికి ఏమీ లేదు కనుక. అక్కడే హాజరై ఉన్నవారిలో ఒకతను "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వ సల్లం, నేను ఇతనికి సవారీ జంతువును ఎవరు ఇవ్వగలరో ఆయనను చూపిస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "మంచిపని చేసే వానితో పాటు (సవారీ జంతువును ఇచ్చే వానితో పాటు) ఇతడు కూడా పుణ్యఫలం లో భాగస్వామి అవుతాడు, ఎందుకంటే, అగత్యపరుణ్ణి అతని అవసరం తీర్చే వాని వైపునకు మార్గదర్శనం చేసినాడు కనుక" అన్నారు.