ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: చనిపోయిన వ్యక్తి యొక్క ఆచరణలు అతని మృత్యువుతో ఆగిపోతాయి; అతని మృత్యువు తరువాత అతడు జీవించి ఉండగా చేసిన తన మంచిపనుల పుణ్యాన్ని పొందడు; కేవలం ఈ మూడు పనుల విషయం లో తప్ప. ఎందుకంటే ఈ మూడు పనులకు కారణం అతడు కనుక: మొదటిది: నిరంతరత మరియు శాశ్వతమైన ప్రతిఫలం కలిగిన దాతృత్వం. ఉదాహరణకు: ధర్మం కొరకు సంపదను అర్పణం చేయడం (ధర్మార్పణం); మస్జిదులను నిర్మించడం; బావులను త్రవ్వించడం మొదలైన ఇటువంటి ఆచరణలు. రెండవది: ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఙ్ఞానము; ఉదాహరణకు ప్రజలకు ప్రయోజనం కలిగించే ఙ్ఞానవంతమైన రచనలు చేయడం; లేదా ఙ్ఞానవంతమైన విషయాలను బోధించుట; ఆ విధంగా నేర్చుకున్న వ్యక్తి దానిని మరొకరికి నేర్పుట. ఆ విధంగా తాను చనిపోయిన తరువాత కూడా ఆ ఙ్ఞానము ఆ విధంగా వ్యాప్తి చెందుతూ ఉండుట. మూడవది: తన తల్లిదండ్రుల కోసం ప్రార్థించే (దుఆ చేసే) నీతిమంతుడైన, విశ్వాసి అయిన కుమారుడు.