ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సహచరులలో ఒక మహిళ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి (బహిష్ఠు స్థితికి సంబంధించి) నిరంతరం రక్తస్రావం అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ కొత్త పరిస్థితి ఎదురు కాకముందు, బహిష్ఠు స్థితి, ఆమెను సలాహ్ (నమాజు) ఆచరించకుండా ఎంతకాలం ఆపి ఉంచేదో, అంత కాలం వేచి ఉండి తరువాత గుసుల్ చేసి నమాజు ఆచరించమని ఆదేశించినారు. అయితే ఆమె స్వచ్ఛందంగా ప్రతి సలాహ్ కు ముందు స్నానం చేసేవారు.