ఈ హదీసులో సహాబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, బహిష్ఠు స్థితి నుండి (గుసుల్ చేసి) పరిశుద్ధత పొందిన తరువాత కూడా స్త్రీ జననాంగము నుండి స్రవిస్తూ ఉండే, పసుపు రంగు లేదా నలుపు రంగు ద్రవాన్ని, బహిష్ఠుగా భాగంగా భావించే వారము కాదు. దాని కారణంగా మేము నమాజు ఆచరించుట లేదా ఉపవాసములు పాటించుట ఆపివేసే వారము కాదు. (దీనిని బట్టి బహిష్ఠు స్థితిలో స్త్రీ జననాంగము నుండి రక్తస్రావము ఆగిపోయిన వెంటనే గుసుల్ చేసి పరిశుద్ధత పొందాలని, ఆతరువాత కూడా ఒకవేళ పసుపు రంగులో కానీ లేక నలుపు రంగులో కానీ ద్రవ పదార్థము స్రవిస్తూ ఉన్నట్లయితే దానిని మలినంగా భావించరాదని, నమాజు, ఉపవాసము మొదలైనవి ఆపివేయరాదని తెలియుచున్నది).