ఫాతిమా బింత్ హుబైష్ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “బహిష్ఠు కారణంగా, బహిష్ఠు దినములు పూర్తి అయిన తరువాత కూడా నాకు రక్తస్రావము జరుగుతూనే ఉంటుంది – మరొక బహిష్ఠు వచ్చేంత వరకు. నేను నమాజు దూరంగా ఉండడానికి బహిష్ఠుకు సంబంధించిన నియమాలే నా ఈ స్థితికి కూడా వర్తిస్తాయా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “అది ‘ఇస్తిహాజహ్ రక్తస్రావము’ (పసుపు వర్ణపు స్రావముతో కూడిన రక్తము). అది అనారోగ్యకరమైనది; గర్భాశయములో రక్తనాళముల ఒరిపిడి కారణంగా జనించే తేమ కారణంగా స్రవించునటువంటిది. అది బహిష్ఠు రక్తము కాదు.” ప్రతి నెల వచ్చే విధంగా సమయానికి బహిష్ఠు వచ్చినపుడు – అంటే ఇస్తిహాదహ్ రక్తస్రావము మొదలు కావడం కంటే ముందు వరకు - ఆ బహిష్ఠు స్థితిలో ఉన్నన్ని రోజులు నమాజుకు, ఉపవాసములకు మరియు సాధారణంగా బహిష్ఠు స్త్రీ దూరంగా ఉండవలసిన అన్ని పనులకు దూరంగా ఉండాలి. బహిష్ఠు యొక్క సాధారణ కాల పరిమితి పూర్తి అయినపుడు, బహిష్ఠు స్థితి నుండి పరిశుద్ధత పొందాలి. ముందుగా రక్తస్రావము జరిగిన ప్రదేశాన్ని పుష్కలంగా నీటితో కడగాలి, తరువాత శరీరం మొత్తాన్ని సంపూర్ణంగా కడగాలి (గుసుల్ చేయాలి), తరువాత నమాజు ఆచరించాలి.