జనాబత్ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయాలని సంకల్పించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా రెండు చేతులను కడుక్కోవడంతో ప్రారంభించేవారు. తరువాత నమాజు కొరకు చేసిన విధంగా వుదూ చేసేవారు, తరువాత తన శరీరముపై నీళ్ళు పోసుకునే వారు, తరువాత తడి చేతుల వేళ్ళను తన తల వెంట్రుకలలోనికి జొప్పించి తల వెంట్రుకల మొదళ్ళ వరకు నీళ్ళు చేరాయని, తల చర్మమంతా బాగా తడిసిందని తృప్తి చెందే వరకు వేళ్ళతో మర్దన చేసేవారు. తరువాత వారు తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత మిగతా శరీరమంతా నీళ్ళు పారించి స్నానం చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: ‘నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే నీటి తొట్టి నుండి ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”