ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత పొందు విషయానికి సంబంధించి కొన్ని నియమాలను వివరించారు. మొదటిది: ఎవరైనా వుజూ చేసినపుడు అతడు తన శ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని తీసుకోవాలి, మరియు శ్వాస ద్వారా ఆ నీటిని చీదివేయాలి. రెండవది: శరీరమునుండి హానికరమైన పదార్థాలు బయటకు వచ్చినపుడు, నీళ్ళు గాక మరింక దేనితోనైనా, అంటే ఉదాహరణకు – చిన్నచిన్న రాళ్లు మొదలైన వాటితో – శుభ్రపరుచుకోవాలనుకుంటే వాటిని బేసి సంఖ్యలో ఉపయోగించాలి. కనిష్టంగా మూడింటిని ఉపయోగించాలి, గరిష్టంగా ఆ హానికర్మైన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు, ఆ ప్రదేశము పూర్తిగా శుభ్రపడేంత వరకు అవసరమైనన్ని ఉపయోగించవచ్చు. మూడవది: ఎవరైతే రాత్రి నిద్ర నుండి మేల్కొంటారో, వారు ముందు రెండు చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు వుదూ చేయడానికి నీటి పాత్రలో చేయి పెట్టరాదు. ఎందుకంటే, అతడు ఎరుగడు రాత్రి అతని చేయి ఎక్కడెక్కడ గడిపిందో. కనుక అతని చేతులు అశుద్ధత నుండి సురక్షితంగా లేవు అన్నమాట. అటువంటి స్థితిలో చేసిన వుదూను షైతాను పనికి రానిదిగా చేస్తాడు; అలాగే మానవ జీవితానికి హానికరమైన పదార్థాలు నీటిలో కలిసేలా చేసి, ఆ నీటిని కలుషితం చేస్తాడు.