మూత్ర విసర్జన కొరకు గానీ, లేక మల విసర్జన కొరకు గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైన నియమిత ప్రదేశములో (మరుగుదొడ్డి, లేక బహిర్భూమిలో) ప్రవేశించడానికి సంకల్పించినట్లయితే ముందుగా (అల్లాహ్ వద్ద) ఆడ మరియు మగ షైతానుల నుండి అల్లాహ్ యొక్క సంరక్షణ కోరేవారు. అపకారము మరియు హాని కలుగజేసే “అల్-ఖుబుసి” మరియు “అల్-ఖబాఇసి” లను కూడా దుర్మార్గమైనవిగానూ మరియు మలినమైనవిగానూ వ్యాఖ్యానించడం జరిగింది.