సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “బహుదైవారాధకులు ఎగతాళిగా మాతో ఇలా అన్నారు: “మీ ప్రవక్త మీకు ప్రతి విషయాన్ని బోధిస్తారు, చివరికి మూత్రవిసర్జన లేక మలవిసర్జన చేసి ఉపశమనం ఎలా పొందాలి అనే విషయం కూడా!” సల్మాన్ రదియల్లాహు అన్హు ఇలా జవాబిచ్చినారు: “అవును, ఆయన మాకు కాలకృత్యాలు తీర్చుకుని మనం ఉపశమనం పొందే విధివిధానాలను, మర్యాదలను నేర్పించినారు. వాటిలో భాగంగా కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, దానిని అశుద్ధత నుండి దూరంగా ఉంచడానికి మరియు దానిపట్ల ఉన్న గౌరవం కారణంగా; అలాగే కాలకృత్యాలు తీర్చుకొను నపుడు (మల విసర్జన మరియు మూత్ర విసర్జన చేయునపుడు) కాబహ్ గృహం వైపునకు ముఖం చేయరాదు అని నిషేధించినారు; శుభ్రపరుచుకోవడానికి జంతువుల పేడను, పిడకలను లేదా మలాన్ని లేదా ఎముకలను ఉపయోగించరాదు అని నిషేధించినారు; మరియు శుభ్రపరుచుకోవడానికి మూడు రాళ్ళ కంటే తక్కువ ఉపయోగించరాదు అని నిషేధించినారు.”