ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ప్రతి రోజూ విధిగా ఆచరించే ఐదుపూటల నమాజులు, ప్రతి శుక్రవారము ఆచరించే ‘శుక్రవారపు జుమఅహ్ నమాజు’, మరియు ప్రతి సంవత్సరం రమదాన్ నెల ఉపవాసాలు విధిగా ఆచరించుట – వాటి మధ్య (దాసుని వల్ల) జరిగే చిన్న పాపములకు అవి పరిహారంగా మారతాయి; అయితే పెద్ద పాపములకు దూరంగా ఉండాలి. పెద్ద పాపములు (అల్ కబాయిర్) అంటే - వ్యభిచారానికి, వివాహేతర లైంగిక సంబంధాలకు పాల్బడుట, మద్యపానము చేయుట వంటివి పరిహరించబడవు. అవి క్షమింపబడుట కొరకు పశ్చాత్తాపము తప్పనిసరి.