ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు దినమున తనకు ఒక తొట్టి ప్రసాదించబడుతుందని, దాని పొడవు, వెడల్పుల రెండు అంచుల మధ్య దూరము ఒక నెల ప్రయాణమంత ఉంటుందని తెలియ జేస్తున్నారు. మరియు దాని నీరు పాలకన్నా తెల్లగా ఉంటాయి. దాని సువాసన యొక్క మాధుర్యం కస్తూరీ గంధపు సువాసన కన్నా మధురంగా ఉంటుంది. దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల మాదిరి అసంఖ్యాకంగా ఉంటాయి. ఆ కప్పులతో అందులోని నీటిని త్రాగిన వారెవరూ ఇంకెన్నడూ దాహానికి లోను కారు.