ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా తనకు పూర్వం ఏ ప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలను అల్లాహ్ తనకు ప్రసాదించినాడు. మొదటిది: నాకు మరియు వారికి మధ్య ఒక నెల ప్రయాణమంత దూరం ఉన్నప్పటికీ, (నా గురించి) శత్రువుల హృదయాలలో జనించే భయోత్పాతం ద్వారా నాకు సహాయం చేయబడింది. రెండవది: భూమి మనకు మస్జిదుగా (ప్రార్థనా స్థలంగా) చేయబడింది, దాని కారణంగా మనం ఎక్కడ ఉన్నా నమాజు చేయవచ్చు మరియు భూమి, నీరు లభ్యం కానప్పుడు ధూళితో శుద్ధి చేసే సాధనంగా కూడా చేయబడింది. మూడవది: యుద్ధ ప్రాప్తి, అంటే అవిశ్వాసులతో జరిగే యుద్ధములలో గెలిచే సంపద, మన కొరకు ధర్మసమ్మతం చేయబడింది. ముస్లిములు అటువంటి సంపదను తీసుకోవచ్చును. నాలుగవది: పునరుత్థాన దినమునాడు భయోత్పాతంలో కొట్టుమిట్టాడుతు నిలుచుని ఉన్న ప్రజలకు ఊరటనిచ్చేలా గొప్ప సిఫారసు చేసే అవకాశం ప్రసాదించబడింది. ఐదవది: నేను సృష్టితాలన్నింటి కొరకు, మానవులకొరకు మరియు జిన్నుల కొరకు (అల్లాహ్ యొక్క సందేశహరునిగా) పంపబడినాను. నాకు పూర్వం పంపబడిన ప్రవక్తలు ప్రత్యేకించి వారి వారి జాతుల కొరకు పంపబడినారు.