ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన జాతివారి నుండి ఎంపిక చేయబడిన శిష్యులు, సహాయకులు, సహచరులు, నిజాయితీ గల ముజాహిదీన్లు కలిగి లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఏ జాతికీ అల్లాహ్ ప్రవక్తను పంపలేదు. అటువంటి శిష్యులు వారి తరువాత వారి ప్రతినిధులుగా (ఖలీఫాలుగా) కాగలిగిన అన్ని అర్హతలూ కలిగి ఉండేవారు. వారు ఆ ప్రవక్త యొక్క సున్నత్’ను అనుసరిస్తారు మరియు ఆయన ఆదేశాలను శిరసావహిస్తారు. ఆ సలఫ్ సాలిహీన్’ల (ధార్మీకులైన పూర్వీకుల) తరువాత మంచివారు కాని వ్యక్తులు వచ్చారు. వారు తాము చేయని పనులను గురించి చెబుతారు మరియు వారు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. కాబట్టి వారితో తన చేతితో పోరాడేవాడు విశ్వాసి, తన నాలుకతో వారితో పోరాడేవాడు విశ్వాసి, మరియు తన హృదయంతో వారితో పోరాడేవాడు విశ్వాసి. అంతకు మించిన విశ్వాసం లేదు, కనీసం ఆవగింజంత కూడా లేదు.