జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు, యుక్తవయస్సుకు చేరువలో ఉన్న బలమైన, దృఢమైన యువకులం. మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈమాన్ నేర్చుకున్నాము. ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము; దాని ద్వారా మా ఈమాన్ మరింత బలపడింది.