ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హును ఖుర్ఆన్ నుండి కొంత భాగం చదివి వినిపించమని కోరారు. దానికి అతను, “ఓ రసూలుల్లాహ్! ఖుర్ఆన్ మీపైనే కదా అవతరించింది కదా! అలాంటప్పుడు నేను మీకు ఖుర్ఆన్ చదివి వినిపించటమేమిటి?” అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “నాకు ఇతరుల నుండి ఖుర్ఆన్ పారాయణం వినాలనిపిస్తోంది” అని అన్నారు. అప్పుడు అతను 'అన్నిసా' సూరహ్ లోని ఈ ఆయతు నుండి పారాయణం మొదలుపెట్టారు. అలా అతను పారాయణం చేస్తూ, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కుకు చేరుకున్నప్పుడు: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا}. అంటే, "నీవు నీ ప్రభువు సందేశాన్ని వారికి చేరవేశావని నీ సమాజంపై నిన్ను సాక్షిగా మేము నిలబెట్టినప్పుడు, నీ పరిస్థితి మరియు నీ సమాజం పరిస్థితి ఏమవుతుంది?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, 'ఇక పారాయణం ఆపు' అని అన్నారు. ఇబ్నె మసూద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ఆయన వైపు తిరిగి చూడగా, ఆ పరిస్థితి యొక్క భయంతో మరియు తన సమాజంపై గల కరుణతో ఆయన కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి.