ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక విశ్వాసి తన విశ్వాసములో నిజాయితీగా ఉండి, మరియు ఆ విశ్వాసముతో అతని హృదయం శాంతిని పొందుతుందో, అతడు మూడు విషయాలతో సంతృప్తి చెందినట్లైతే, అటువంటి విశ్వాసి తన హృదయంలో విశాలతను కనుగొంటాడు, అందులో ఆనందాన్ని గ్రహిస్తాడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు చేరువగా ఉండే ప్రీతిని, ఆనందాన్ని పొందుతాడు. మొదటిది: అల్లాహ్’యే తన ప్రభువు అని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, అతని ప్రభువు నుండి అతని భాగంగా అతనికి చేరే ఉపాధి, మరియు అతనిపై వచ్చిపడే పరిస్థితులు అన్నింటి పట్లా అతని హృదయం సంతృప్తితో విశాలం అవుతుంది. అతను తన హృదయంలో దేనిపైనా ఎటువంటి అభ్యంతరాన్ని కనుగొనడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను వదిలి మరొక ప్రభువు కావాలని కోరడు. రెండవది: ఇస్లాం తన ధర్మమని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, ఇస్లాంయొక్క విధులు మరియు బాధ్యతలపట్ల అతని హృదయం విశాలం అవుతుంది, మరియు అతడు ఇస్లాంను వదిలి మరొక మార్గాన్ని ఎంచుకొనడు. మూడవది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అనే విషయంలో సంతృప్తి చెందుట: ఆ విషయంలో సంతృప్తి చెందితే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన సందేశము మరియు బోధించిన ప్రతి విషయంతో అతడు ఎటువంటి సందేహమూ, సంశయమూ లేకుండా అతని హృదయం విశాలం అవుతుంది. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకం చేసిన విషయాన్ని తప్ప మరింక దేనినీ అనుసరించడు.