విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజియల్లాహు అన్హా ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వమును గురించి చెప్పమని అడగడం జరిగింది. జవాబుగా ఆమె ఒక సమగ్రమైన పదాన్ని సూచించినారు. ప్రశ్నించిన వ్యక్తిని ఆమె, గుణగణాలన్నింటి సంపూర్ణత్వాన్ని కలిగిన పవిత్ర ఖుర్’ఆన్ వైపునకు మరలించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడవడి, నైతికత, శీలసంపద, వ్యక్తిత్వములను గురించి, ఆయిషా రజియల్లాహు అన్హా – వారు ఖుర్’ఆన్ యొక్క స్థిరప్రకృతి పై ఉన్నారని అన్నారు. ఖుర్’ఆన్ లో ఏమి ఆదేశించ బడినదో వారు దానిపై స్థిరంగా ఉండేవారు, అందులో ఏమి నిషేధించబడినదో వారు దానినుండి దూరంగా ఉండేవారు. వారి స్థిరప్రకృతి ఖుర్’ఆన్ ప్రకారం ఆచరించడమే అయి ఉండేది. ఖుర్’ఆన్ విధించిన హద్దులలో ఉండుట, సభ్యత, మర్యాదలలోఖుర్’ఆన్ ప్రకారం నడుచుకొనుట చేసేవారు. ఖుర్’ఆన్ లో తెలుపబడిన ఉదాహరణలు, ఉపమానాలు మరియు గాధలను అనుసరించడం పట్ల శ్రధ్ధ వహించేవారు.