రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరుల గురించి ఏదో విన్నారు, అంటే వారు ఆయనను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కలత చెంది ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నాకు స్వర్గం మరియు నరకం చూపించబడ్డాయి. నేను ఈ రోజు స్వర్గంలో చూసిన దానికంటే ఎక్కువ మంచిని, శుభాన్ని ఎప్పుడూ చూడలేదు, మరియు ఈ రోజు నరకంలో చూసిన దానికంటే ఎక్కువ చెడును, కీడును ఎప్పుడూ చూడలేదు. నేను చూసినది మీరు చూసి ఉంటే, ఈరోజు, అంతకు ముందు రోజు నేను చూసిన దాని నుండి నాకు తెలిసినది మీరు తెలుసుకుని ఉంటే, నిశ్చయంగా మీరు చాలా భయపడి ఉండేవారు, నిశ్చయంగా మీ నవ్వు తక్కువై పోయేది, మరియు మీ ఏడుపు పెరిగి ఉండేది. అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులకు ఇంత కష్టమైన రోజు మరొకటి లేదు. వారు తమ తలలను కప్పుకుని ఏడువ సాగారు, ఏడుపు తీవ్రత కారణంగా వారి ముక్కుల నుండి శబ్దాలు రాసాగినాయి. ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి ఇలా అన్నారు: మేము అల్లాహ్‌ను మా ప్రభువుగా, ఇస్లాంను మా ధర్మముగా, ముహమ్మద్‌ను సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్తగా సంతృప్తి చెందాము. అనస్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: అపుడు ఒకతను నిలబడి ఇలా అన్నాడు: “నా తండ్రి ఎవరు?” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఫలానా అతడు నీ తండ్రి”; అపుడు ఈ ఆయతు అవతరించినది. {ఓ విశ్వాసులారా! ఒకవేళ మీకు గనక వివరిస్తే మీకే ఇబ్బంది కలిగించే విషయాలను గురించి అడగకండి...} ” [అల్’మాయిదహ్ 5:101]