ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఉలమాలు, పండితులు, విద్వాంసుల ముందు డాంబికాలు పలుకడానికో, లేదా ‘నేను కూడా మీలాగే పండితుడిని’ చెప్పుకోవడానికో, లేక బుద్ధి హీనులు, అఙ్ఞానులతో వాదనలో వారిలో పైచేయి అనిపించుకోవడానికో, లేక సభలు, సమావేశాలలో ప్రాముఖ్యత సాధించుకోవడానికో ఙ్ఞాన సముపార్జన చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తారో అలాంటి వారు తమ ప్రదర్శనా బుద్ధి కారణంగా, మరియు ఙ్ఞాన సముపార్జన కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి అనే సంకల్పశుద్ధి లేకపోయినందువల్ల అతడు నరకాగ్నికి పాత్రుడు అవుతాడు.