ఉఖబహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ లోకము నందు మరియు పరలోకము నందును ఒక విశ్వాసి మోక్షము పొందే మార్గములు ఏమిటి అని ప్రశ్నించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దానికి నీవు మూడు విషయాలు ఆచరించాలి” “మొదటిది: చెడు విషయాలు మాట్లాడుట నుండి, కీడు కలిగించే విషయాలు పలుకుట నుండి నీ నాలుకను అదుపులో ఉంచుకో, (నీ నాలుకతో) మంచి తప్ప మరేమీ మాట్లాడకు.” “రెండవది: నీ ఏకాంతములో అల్లాహ్’ను ఆరాధించుట కొరకు (ఎక్కువగా) ఇంటి పట్టునే ఉండు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు విధేయత చూపే కార్యాలలో నిన్ను నీవు నిమగ్నం చేసుకో; (ప్రాపంచిక) ప్రలోభాలనుండి, ఆకర్షణల నుండి నిన్ను నీవు వేరు చేసుకో”; “మూడవది: నీవు చేసిన పాపాల పట్ల దుఃఖపడు, విచారపడు మరియు పశ్చాత్తాపపడు.”