ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక విశ్వాసి యొక్క ప్రవృత్తి ఇలా ఉండదు – ఇతరులను వారి వంశం ఆధారంగా (కులం, మతం, ధర్మం ఆధారంగా) విమర్శించడం, లేదా శపించడం, లేదా తిట్లు తిట్టడం, మాటలలోగానీ లేక చేతలలో గానీ సిగ్గుమాలిన తనానికి పాల్బడడం. ఒక నిజమైన విశ్వాసి ఇవన్ని చేయడు.