ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ముగ్గురు వ్యక్తులు మినహా, ఆదం సంతానం మొత్తం తమ జవాబుదారీ తనానికి కట్టుబడి ఉంది. ఆ ముగ్గురు: యుక్తవయస్సుకు చేరని పిల్లలు, వారు యుక్తవయస్సుకు చేరేంత వరకు; మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి (పిచ్చివాడు) అతడు తిరిగి మతి స్థిమితం పొందేంత వరకు; మరియు నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుండి మేల్కొనేంత వరకు. పైన పేర్కొనబడిన వారి నుండి జవాబుదారితనం లేపి వేయబడింది; వారి పాపపు చర్యలు వారికి వ్యతిరేకంగా నమోదు చేయబడవు, అయితే యుక్త వయస్సుకు చేరని చిన్న పిల్లవాడు ఏదైనా మంచి పని చేస్తే, ఆ మంచి అతని పేర నమోదు అవుతుంది కానీ పిచ్చివాడికి మరియు నిద్రపోయే వ్యక్తికి కాదు. ఎందుకంటే వారు భావోద్వేగాలు లేని వేరే స్థితిలో, వేరే ప్రపంచములో ఉంటారు. సాధారణ స్థితిలో ఉండే స్పృహ, సచేతనత్వం కలిగి ఉండని కారణంగా వారు ఏ ఆరాధననూ సక్రమంగా నిర్వహించలేని స్థితిలో ఉంటారు.