ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదార స్వభావి, రమదాన్ మాసంలో ఆయన దాతృత్వం మరింతగా పెరిగిపోయేది. తనను అర్థించిన వారికి ఏది అవసరమో దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చివేసేవారు. ఆయన దాతృత్వం అధికం కావడానికి రెండు విషయాలు కారణంగా ఉండేవి, అవి: మొదటిది: జిబ్రీల్ (అలైహిస్సలాం) తో ఆయన సమావేశం కావడం; రెండవ విషయం: కంఠస్థము చేసి, ధారణలో ఉంచుకున్న ఖుర్’ఆన్ ను పునశ్చరణ చేయడం. జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ యొక్క అవతరించిన ప్రతి ఆయతును ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో అధ్యయనం చేసేవారు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత ఉదారత్వముతో; అర్థించిన వారికి అర్థించిన దాని కంటే ఎక్కువ ప్రసాదిస్తూ, వీలైనంత ఎక్కువ మంచి చేస్తూ, అల్లాహ్ తన కరుణతో పంపే వర్షం మరియు మంచి గాలి కంటే వేగంగా ప్రజలకు మరింత త్వరగా ప్రయోజనం చేకూరుస్తూ ఉండేవారు.