ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను స్వర్గములోనికి ప్రవేశించడానికి కారణమయ్యే ఆచరణలు ఏవి లేక అల్లాహ్’కు ఇష్టమైన ఆచరణలు ఏవి? అని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చినారు: “(ఎక్కువ సలాహ్’లు (నమాజులు) ఆచరించడం ద్వారా) ఎక్కువ సజ్దాలు చేయడానికి కట్టుబడి ఉండు. ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దహ్ నీ స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు నీ నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు.