ఈ హదీసులో జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు – ఖచ్చితంగా కట్టుబడి ఉండడానికి సంకల్పించుకుని 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసినాను' అని తెలియజేస్తున్నారు – తౌహీదునకు (కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విశ్వాసానికి – ఏకదైవారాధనకు) కట్టుబడి ఉంటానని; ప్రతిరోజూ రాత్రింబవళ్ళలలో విధిగా ఆచరించవలసిన నమాజులను, వాటి షరతులను, వాటి మూలస్థంభముల వంటి విషయాలను, వాటికి చెందిన ఫర్జ్ (తప్పనిసరి) మరియు సున్నత్ విషయాలను పాటిస్తూ ఆచరించుటకు కట్టుబడి ఉంటానని; అల్లాహ్ చే ఆదేశించబడిన - ఒక ఆర్ధిక పరమైన ఆరాధన అయిన – జకాతును చెల్లించుటకు కట్టుబడి ఉంటానని (ఇది సంపన్నులనుండి సేకరించబడి, అర్హులైన పేదలకు మరియు అక్కర గలవారికి పంచిపెట్ట బడుతుంది); పాలకునికి విధేయత చూపుతానని, మరియు ప్రతి ముస్లిం పట్ల నిజాయితీగా ఉంటానని, నా మాటల ద్వారా మరియు నా చేతల ద్వారా అతనికి మంచి జరిగేలా చూస్తాను అని, అతడి నుండి చెడును, కీడును దూరం చేస్తాను అని ప్రమాణం చేసాను.