ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ మార్గంలో పోరాడే ఒక యోధుని కొరకు – ఎవరైతే ప్రయాణ సాధనాలు, ఆయుధాలు, వాహనం, ఆహారం, ఆహారపదార్థాలు, ఇంకా అతనికి అవసరమైన ఇతర వస్తువులతో సహా ఆ యోధుడిని సిద్ధపరుస్తాడో, అతడు కూడా యోధుడిగానే పరిగణించబడతాడు మరియు (తీర్పు దినమునాడు) అతడు ఒక యోధునికి లభించే పుణ్యఫలాన్ని పొందుతాడు. అలాగే ఎవరైతే యోధుని పరోక్షంలో అతని వ్యవహారాలను చక్కగా చూసుకుంటాడో మరియు అతను లేనప్పుడు అతని కుటుంబాన్ని చూసుకోవడంలో అతని స్థానంలో అతని ప్రతినిధిగా ఉంటాడో అతడు కూడా యోధునిగా పరిగణించబడతాడు.