ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హుకు ఇలా తెలియజేసినారు: "ఎవరైనా అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఆరాధ్యుడిగా, యజమానిగా, అధిపతిగా మరియు ఆజ్ఞాపకుడిగా అంగీకరిస్తే మరియు ఇస్లాం ధర్మాన్ని తన ధర్మంగా పూర్తిగా స్వీకరించి, దాని ఆజ్ఞలు, నిషేధాలన్నింటికీ లోబడి జీవిస్తే మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా అంగీకరించి, ఆయనపై అవతరించిన ప్రతిదాన్ని విశ్వసిస్తే, అలాంటి వ్యక్తి కొరకు స్వర్గం తప్పనిసరి అవుతుందనే హామీ ఉన్నది. అది విని అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఆశ్చర్యపోతూ, "ఓ రసూలల్లాహ్! దయచేసి మళ్ళీ చెప్పండి," అని అడిగారు. ప్రవక్త మళ్ళీ చెప్పారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: "ఇంకా ఒక గుణం ఉంది — దాని వలన అల్లాహ్ తన దాసుడిని స్వర్గంలో నూరు స్థాయిల పైకి ఎత్తుతాడు. ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం, ఆకాశం-భూమి మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అబూ సయీద్ రదియల్లాహు అన్హు: "అది ఏమిటి, ఓ రసూలల్లాహ్ ?" అని అడిగినారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం."