ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు అల్లాహ్ రమజాన్ నెల ఉపవాసములు ఆచరించుటను విధిగావించినాడనే విషయాన్ని విశ్వసిస్తూ; ఉపవాసములు పాటించే వారి కొరకు అల్లాహ్ తన అంతులేని ఖజానాల నుండి సిధ్ధం చేసి ఉంచిన పారితోషికం, ప్రతిఫలం మరియు పుణ్యఫలముల నందు విశ్వసిస్తూ; ప్రదర్శనా బుధ్ధితో గాక లేదా పేరు ప్రతిష్టల కొరకు గాక, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే సంకల్పించి, రమజాన్ నెల ఉపవాసములు ఆచరిస్తారో అటువంటి వారి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.