రమదాన్ నెల ప్రారంభమైనప్పుడు, మూడు విషయాలు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు: మొదటిది: స్వర్గద్వారాలు తెరవబడతాయి మరియు వాటిలో ఏదీ మూసివేయబడదు. రెండవది: నరకద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏదీ తెరవబడదు. మూడవది: షైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో కట్టివేయబడతారు. అందువలన, రమదాన్ కాకుండా ఇతర నెలలలో వారు సాధించగలిగిన సాఫల్యాలు, ఈ నెలలో సాధించలేరు (అంటే ప్రజలను మార్గభ్రష్టత్వం వైపు ప్రేరేపించలేరు). ఇవన్నీ ఈ పవిత్రమైన నెల గొప్పదనాన్ని కీర్తించడానికీ, అలాగే నమాజ్, సదకా, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మొదలైన పుణ్యకార్యాలు ఎక్కువగా చేసేలా, పాపాలు మరియు అవిధేయతలు నుండి దూరంగా ఉండేలా విశ్వాసులను ప్రోత్సహించడానికీను.