ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినం యొక్క కొన్ని లక్షణాలను వివరించారు. తీర్పు కోసం ప్రజలు తమ సమాధుల నుండి పునరుత్థానం చేయబడిన (లేపబడిన) తర్వాత ఒకచోట సమీకరించబడతారు. వారు కాళ్ళకు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, ఏ ఆచ్ఛాదనా లేకుండా, నగ్నంగా ఉంటారు. వారి తల్లులు వారిని కన్న దినాన ఉన్నట్లుగా వారు వొడుగులు (సున్తీ) చేయని స్థితిలో ఉంటారు. ఆయిషా రదియల్లాహు అన్హా ఇది వినగానే, ఆమె ఆశ్చర్యంతో ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అపుడు స్త్రీలు, పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఇలా వివరించినారు: (అల్లాహ్ ముందు) నిలబడటం మరియు పునరుత్థానం తర్వాత ఒక చోట సమీకరించబడడం - ఆ పరిస్థితి చాలా భయంకరమైన సంఘటనలతో నిండి ఉంటుంది, ప్రజలు ఇతరుల నగ్నత్వాన్ని కూడా గమనించలేనంతగా (తమ విషయంలో ఏమని తీర్పు వెలుపడుతుందో అని) భయకంపితులై ఉంటారు.