ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా స్పష్టం చేసినారు: ఆయన దేని నుంచైనా మనల్ని వారించినప్పుడు, మనం దాని నుండి ఎలాంటి మినహాయింపు లేకుండా పూర్తిగా దూరంగా ఉండ వలెను. మరియు ఆయన దేనినైనా మనకు ఆజ్ఞాపించినప్పుడు, మనం మన శక్తి మేరకు దానిని పూర్తి చేయ వలెను. అనంతరం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వం గతించిన కొన్ని సమాజముల వలె ప్రవర్తించవద్దని మనల్ని హెచ్చరించారు. వారు తమ ప్రవక్తలను మరీ ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు మరియు ధిక్కరించేవారు. దాని ఫలితంగా, అల్లాహ్ వారిని వివిధ రకాల వినాశనాలతో మరియు విధ్వంసాలతో శిక్షించాడు. కాబట్టి, వారు నాశనమైనట్లుగా మనం కూడా నాశనం కాకుండా ఉండటానికి మనం వారిలా ప్రవర్తించకూడదు.