సూర్యుడు ఉదయించే దినములలో అత్యంత ఉత్తమమైన దినము శుక్రవారము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. శుక్రవారము యొక్క ప్రత్యేకతలలో ఇవి కొన్ని: శుక్రవారము నాడు అల్లాహ్ ఆదం అలైహిస్సలాం ను సృష్ఠించినాడు; శుక్రవారం నాడే ఆయనను స్వర్గములో ప్రవేశింపజేసి నాడు; శుక్రవారము నాడే ఆయనను స్వర్గము నుండి బయటకు తీసి భూమి పైకి పంపినాడు; మరియు శుక్రవారమునాడు తప్ప ప్రళయ ఘడియ స్థాపించబడదు.