అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఇంకా వివాహం చేసుకోని మరియు పురుషులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలగని, తన ఇంటి వారితోనే ఎక్కువగా ఉండే అమ్మాయి కంటే కూడా ఎక్కువ బిడియము, నిరాడంబరత, వినయము కలిగి ఉండేవారు. ఈ లక్షణాలు ఆయనలో ఎంత ఎక్కువగా ఉండేవి అంటే, ఆయన ఏదైనా విషయాన్ని ఇష్టపడకపోతే, వెంటనే ఆయన ముఖం మారిపోయేది, (కొంతసేపు) ఆయన మాట్లాడేవారు కాదు. ఆయన సహాబాలు ఆయన ముఖం మీద అయిష్టతను చూసి అర్థం చేసుకునేవారు.