విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా (రదియల్లాహు అన్హా), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: "సఫీయ్యా గురించి మీకు తెలుసు కదా..." (అంటే, ఆమె శరీరంలో ఒక లోపం గురించి అంటే ఆమె పొట్టిగా ఉండడం గురించి ప్రస్తావించారు). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానము ఇచ్చినారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది ఆ నీటిని పూర్తిగా కలుషితం చేసి, దాని స్వభావాన్ని మార్చి, చెడిపోయేలా చేస్తుంది." అపుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: "నేను ఒకరిని వెక్కిరిస్తూ అనుకరించాను." దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎంతటి గొప్ప సంపద ఇచ్చినా కూడా, నేను ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడడాన్ని, లేదా అతడి చర్యలను / మాటలను వెక్కిరిస్తూ, ఆటపట్టిస్తూ అనుకరించడాన్ని నేను ఇష్టపడను."