ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపనార్థాలు పెట్టినట్లుగా అతడికి తలవంపులు కలగాలని, అతడు అవమానం పాలు కావాలని, ఎంతగా దుఆ చేసినారు అంటే, చివరికి వారి ముక్కు మట్టిలో పెట్టినంతగా. అక్కడ ఉన్న వారు “ఎవరు అతడు ఓ రసూలల్లాహ్, మీరు అంతగా అతనికి వ్యతిరేకంగా దుఆ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఎవరైతే తన తల్లిదండ్రులలో – ఒకరిని గానీ లేక ఇద్దరిని గానీ - తన జీవితములోనే వృద్ధాప్యానికి చేరుకోవడం చూస్తాడో, వారి పట్ల దయ, కరుణ కలిగి ఉండక, వారి పట్ల అవిధేయుడై ఉండి ఆ కారణంగా అతడు స్వర్గములోనికి ప్రవేశించలేడో – అతడు’ అన్నారు.