ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ తర్వాత వెంటనే జకాతుల్ ఫితర్ దానం చెల్లింపును తప్పనిసరి చేశారు.దీని పరిమాణం ఒక "సాఅ (దాదాపు 2.75 కిలోగ్రాములు)", ఇది బరువులో నాలుగు "ముద్ లకు (దాదాపు 0.6875 గ్రాములు)" సమానం. ఒక ముద్ద్ అంటే సగటు వ్యక్తి రెండు దోసేళ్ళ పరిమాణం (ఖర్జూరాలు లేదా యవలు). ప్రతి ముస్లిం—స్వతంత్రుడైనా, బానిస అయినా, పురుషుడైనా, స్త్రీయైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా — ఇది తప్పక దానం చేయాలి. ఇది తన అవసరాలకు మించి, తన కుటుంబ సభ్యులకు ఆ దినము మరియు రాత్రి అవసరాలకు మించి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రజలు ఈద్ నమాజ్‌కు వెళ్లే ముందే జకాతుల్-ఫిత్ర్ దానం చెల్లించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు.