జర్ర్ బిన్ హుబైష్, సఫ్వాన్ బిన్ అస్సాల్ రదియల్లాహు అన్హు వద్దకు మేజోళ్లపై మసాహ్ గురించి అడగడానికి వచ్చారు. అప్పుడు సఫ్వాన్ అడిగారు: ఓ జర్ర్, ఏ విషయం నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది? దానికి జర్ర్ ఇలా బదులిచ్చారు: జ్ఞానాన్వేషణ. అప్పుడు ఆయన అన్నారు: నిశ్చయంగా, జ్ఞాన విద్యార్థి చేసే దాని పట్ల సంతోషం మరియు గౌరవంతో దైవదూతలు తమ రెక్కలను పరుస్తారు. అప్పుడు జర్ర్ అన్నారు: మలమూత్ర విసర్జనల తరువాత మేజోళ్లపై మసాహ్ చేసే విషయంలో నా మనస్సులో సందేహం కలిగింది. మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని వారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఏమైనా ప్రస్తావించగా మీరు విన్నారా? సఫ్వాన్ అన్నారు: "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు లైంగిక అశుద్ధావస్థ (జనాబత్) ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జనకి, నిద్రించి లేచినందుకు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు." అప్పుడు నేను, "మీరు ప్రేమాభిమానం గురించి ఆయన ఏమైనా ప్రస్తావించగా విన్నారా?" అని అడిగాను. అతను ఇలా అన్నాడు: అవును, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక ప్రయాణంలో ఉన్నాము. మేము ఆయన వద్ద ఉండగా ఒక పల్లెవాసి బిగ్గరగా పిలిచాడు: ఓ ముహమ్మద్! దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అతని స్వరానికి తగ్గట్టుగా హెచ్చు స్వరంతో సమాధానమిచ్చారు: అవుడు మేము అతనితో "ఇలా రా" అన్నాము: ఇంకా ఇలా అన్నాము, "నీకు వినాశం! నీ స్వరం తగ్గించు, ఎందుకంటే నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నావు, ఆయన వద్ద స్వరం పెంచి మాట్లాడటం నిషేధించబడింది."a b 5⅝ అప్పుడు అతను తన మొరటు స్వభావంతో, “అల్లాహ్ సాక్షిగా! నేను నా స్వరాన్ని తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి, “ఓ రసూలుల్లాహ్! ఒక వ్యక్తి సత్పురుషులను ప్రేమిస్తాడు, కానీ వారిలాంటి కర్మలు చేయలేడు. మరి అతడి సంగతి ఏమిటి?” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను అభిమానించిన వారితోపాటే ఉంటాడు” అని చెప్పారు. జిర్ర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆ తరువాత సఫ్వాన్ మాతో మాట్లాడుతూ, సిరియా వైపు ఉన్న పశ్చాత్తాప ద్వారం (బాబ్ లిల్ తౌబహ్) గురించి ప్రస్తావించారు. అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన రోజే దానిని కూడా సృష్టించాడు. దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు. సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు అది మూసుకోదు.