ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రయాణంలో ఉన్నారు. అపుడు వారు వుజూ చేసినారు. వుజూలో కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి, వారు పాదాలకు తొడుగుకుని ఉన్న “ఖుఫ్ఫైన్” లను (పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను) తొలగించి, వారి పాదాలాను కడగడానికి, ముగీరహ్ రజియల్లాహు అన్హు వంగి తన చేతులను ముందుకు చాచినారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వాటిని అలాగే ఉండనివ్వు, వాటిని తొలిగించకు. ఎందుకంటే నేను వాటిని పూర్తిగా వుదూ ఆచరించి కాళ్ళకు తొడిగినాను”. అలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుఫ్ఫైన్’లపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).